కొత్త సందేశాలను లేదా తాజాకరించిన విషయాలను వాడుకరులకు చూపించడానికి వెబ్‌సైట్లను వెబ్ పుష్ అనుమతిస్తుంది. ఫైర్‌ఫాక్స్ తెరచిఉన్నపుడు అనుమతించిన వెబ్‌సైట్లు మీ విహారిణికి గమనింపులను పంపవచ్చు వాటిని తెర మీద చూపించవచ్చు. వాడుకరులు సులభంగా గమనింపులను అనుమతించవచ్చు లేదా ఆపివేయవచ్చు, ఈ గమనింపులను ఎలా కనిపించాలో నియంత్రించుకోవచ్చు.
విషయాల పట్టిక
- 1 నవీకరించిన గమనింపులు
- 2 వెబ్ పుష్ అంటే ఏమిటి?
- 3 ఇది ఎలా పని చేస్తుంది?
- 4 నేను ఒక వెబ్‌సైటుతో ఏయే సమాచారాన్ని పంచుకుంటాను?
- 5 వెబ్ పుష్ అందించడానికి ఫైర్‌ఫాక్స్ ఏ సమాచారాన్ని వాడుకుంటుంది?
- 6 ఒక నిర్దిష్ట సైటుకి వెబ్ పుష్ అనుమతులు ఎలా ఉపసంహరించుకోవచ్చు?
- 7 నా వెబ్ సైటుకు వెబ్ పుష్‌ను ఎలా జోడించాలి?
- 8 గమనింపులను అనుమతించమని ఫైర్‌ఫాక్స్ నన్ను అడగకుండా ఎలా ఆపాలి?
- 9 వెబ్ పుష్‌ని పూర్తిగా అచేతనం చేయడం ఎలా?
నవీకరించిన గమనింపులు
వెర్షన్ 44 నుండి, సైటు తెరిచిలేకపోయినా ఫైర్‌ఫాక్స్ తెర మీద గమనింపులను చూపించగలదు. ఒక W3C ప్రమాణం Push APIని ఉపయోగించి, ఫైర్‌ఫాక్స్ ఒక పుష్ సందేశాన్ని అందుకుంటుంది, ఏ సమయంలోనైనా (వాడుకరి అనుమతి ఉంటే) సందేశాలను చూపించగలదు. సైట్లు కూడా మీకు ఒక గమనింపును చూపించకుండా వెనుతలంలో సమాచారాన్ని తాజాపరచుటకు పుష్‌ని ఉపయోగించవచ్చు. మీరు ఇప్పటికే గమనింపులను పంపడానికి ఒక సైటుకు అనుమతి ఇచ్చిఉంటే, ఆ సైటు కూడా పుష్ APIని వాడుకోగలదు. ఒక నిర్దిష్ట సైటుకు అనుమతి ఇవ్వాలో వద్దో ఈ క్రింది సూచనల ద్వారా ఎంచుకోవచ్చు:
- నియంత్రణా కేంద్రం చూడటానికి ప్రతీకంపై నొక్కండి.
- ప్రాంప్టులోని బాణం గుర్తుపై నొక్కండి.
- పేజి సమాచార విండో కొరకు పై నొక్కండి.
- "అనుమతులు" ట్యాబుపై నొక్కండి.
- గమనింపులను అందుకోవడం కింద, ఈ గమనింపు ఐచ్ఛికాలను ఎంచుకోండి: , , or . మీకు కనబడే ఐచ్ఛికాలు ఎంచుకోవడానికి లేకుండా ఉంటే "అప్రమేయాన్ని వాడు" పక్కన ఉన్న చెక్‌మార్కును తీసివేయండి.
వెబ్ పుష్ అంటే ఏమిటి?
వెబ్ పుష్ అనేది వెబ్‌సైట్లు తెరిచిలేకపోయినా అవి మీకు సందేశాలను పంపడాన్ని అనుమతించే ఒక ఐచ్ఛిక లక్షణం. నేపథ్యంలో సందేశాలను లేదా తాజా సమాచారాన్ని మీకు అందించడానికి ఈ సౌలభ్యాన్ని సైట్లు వాడుకోవచ్చు.
ఉదాహరణకు, మీ అభిమాన షాపింగ్ వెబ్‌సైట్ల నుండి మీకు కొత్త ప్రమోషన్లను ఆఫర్లను అందించే గమనింపులకు మీరు చందాచేరవచ్చు. మీరు వేర్వేరు వెబ్‌సైట్ల నుండి గమనింపులకు చందాచేరవచ్చు. ఒక కచేరీ సైటు మీ ఇష్టమైన బ్యాండు వారి ప్రదర్శనల గురించి మీకు గమనికలు అందించవచ్చు, ఆ సైటును అందుకు మీరు అనుమతించవచ్చు, ఒక వారం తర్వాత మీ బ్యాండు పర్యటనలో ఉంటే మీకు గమనింపు వస్తుంది.
మీరు అనుమతి ఇచ్చిన సైట్ల నుండి మాత్రమే మీరు గమనింపులను అందుకుంటారు.
ఇది ఎలా పని చేస్తుంది?
వెబ్‌సైట్లు Service Workerను స్థాపించవచ్చు. ఇది పరిమిత సౌలభ్యాలతో ఉన్న నేపథ్య వెబ్ పేజీ, ఇది పుష్ సేవకు చందాచేరగలదు. ఆ తర్వాత వెబ్‌సైటు పుష్ సందేశాన్ని మొజిల్లా వెబ్ పుష్ సేవ ద్వారా మీ విహారిణికి పంపగలదు. మీ విహారిణి ఆ సందేశాన్ని ప్రాసెస్ చేసి మీ తెరపై గమనింపును చూపించగలదు.
గమనింపుపై నొక్కితే అది ఒక వెబ్‌సైటును తెరవచ్చు లేదా ఆ సైటు తెరిచివుంటే ఆ ట్యాబుకు మారుతుంది.
నేను ఒక వెబ్‌సైటుతో ఏయే సమాచారాన్ని పంచుకుంటాను?
మీరు అనుమతి ఇచ్చిన వెబ్‌సైటు అది తెరిచిలేకున్నా కూడా మీకు పుష్ సందేశాలు పంపవచ్చు. తెరపై గమనింపు కనబడకుండా ఎన్ని పుష్ సందేశాలు సైట్లు పంపవచ్చో ఒక కోటా పరిమితి చేస్తుంది. ఆ కోటాను మించిన వెబ్‌సైట్లకు పుష్ సందేశాలు అచేతనం చెయ్యబడతాయి, మళ్ళీ చందాచేరడానికి వాడుకరి ఆ సైటుకు మరోసారి వెళ్ళాల్సివుంటుంది. వెబ్‌సైట్లు నేరుగా మీ ఐపీ చిరునామాను నిర్ధారించుకునే అవకాశం వెబ్ పుష్ కల్పించదు.
వెబ్ పుష్ అందించడానికి ఫైర్‌ఫాక్స్ ఏ సమాచారాన్ని వాడుకుంటుంది?
ఫైర్‌ఫాక్స్ తెరిచి ఉన్నంతసేపూ, పుష్ సందేశాలు అందుకోవడం కోసం పుష్ సేవకు ఒక క్రియాశీల అనుసంధానాన్ని కొనసాగిస్తుంది. ఫైర్‌ఫాక్స్‌ను మూసివేసినపుడు ఈ అనుసంధానం మూతబడుతుంది. మా సర్వర్లో మీ విహారిణి కొరకు ఒక యాధృచ్చిక గుర్తింపు, మీరు అనుమతించే ప్రతి సైటుకి ఒక యాధృచ్చిక గుర్తింపు నిల్వ ఉంటుంది.
డెస్క్‌టాపు ఫైర్‌ఫాక్స్‌లో పుష్ సేవను మొజిల్లా నిర్వహిస్తుంది. ఆండ్రాయిడ్ కోసం ఫైర్‌ఫాక్స్ మొజిల్లా వెబ్ పుష్ సేవను మరియు గూగుల్ క్లౌడ్ సందేశ వేదికను ఆండ్రాయిడ్ ఫైర్‌ఫాక్స్‌లో గమనింపులను పంపుటకు వాడుతుంది.
ఈ రెండు సందర్భాలలో, పుష్ సందేశాలు IETF spec ప్రకారం ఎన్‌క్రిప్ట్ చెయ్యబడతాయి, వాటిని కేవలం మీ ఫైర్‌ఫాక్స్ మాత్రమే అవగతం చేసుకోగలుగుతుంది. ఎన్‌క్రిప్ట్ అయిన సందేశాలు అవి పంపబడేవరకు లేదా కాలంచెల్లేవరకు నిల్వ ఉంటాయి.
ఒక నిర్దిష్ట సైటుకి వెబ్ పుష్ అనుమతులు ఎలా ఉపసంహరించుకోవచ్చు?
వెబ్ పుష్ ఎల్లప్పుడూ ఫైర్‌ఫాక్స్‌లో ఆప్ట్-ఇన్. మీ అనుమతి లేకుండా ఏ సైటూ మీకు పుష్ సందేశాలను పంపలేదు. మీకు పుష్ సందేశాలను పంపకుండా ఒక నిర్దిష్ట సైటును ఆపడానికి:
- మెనూ బొత్తం మీద నొక్కి ఎంచుకోండి.
- పానెల్‌ను ఎంచుకుని, కిందనున్న "అనుమతులు" విభాగానికి వెళ్ళండి.
- బొత్తం"గమనింపులు" పక్కనున్న నొక్కండి. బొత్తం
- వెబ్‌సైటును ఎంచుకోండి.
- బొత్తాన్ని నొక్కండి.
- మెనూ బొత్తం మీద నొక్కి ఎంచుకోండి.
- పానెల్‌ను ఎంచుకుని, "గమనింపులు" కింద ఉన్న బొత్తాన్ని నొక్కండి.
- సైటును ఎంచుకోండి.
- ను నొక్కండి.
ఏ సైట్లూ మీకు పుష్ సందేశాలు పంపకుండా ఆపివేయడానికి, పైన చెప్పిన అంచెలను అనుసరించండి, కానీ ఒక నిర్దిష్ట సైటును ఎంచుకోకుండా ని నొక్కండి. ఇలా చేస్తే వెబ్‌సైట్లు మీకు సందేశాలను పంపలేవు, భవిష్యత్తులో పంపాలన్నా మీ అనుమతిని అడగాల్సి ఉంటుంది.
నా వెబ్ సైటుకు వెబ్ పుష్‌ను ఎలా జోడించాలి?
Push API specification పేజీ ఒక సర్వీస్ వర్కర్‌ని సృష్టించి పుష్ సందేశాలను పంపడాన్ని వివరిస్తుంది.
గమనింపులను అనుమతించమని ఫైర్‌ఫాక్స్ నన్ను అడగకుండా ఎలా ఆపాలి?
ఒక సైటు అప్రమేయంగా గమనింపులను చూపిస్తానని ఫైర్‌ఫాక్స్‌కి తెలిపినపుడు, ఫైర్‌ఫాక్స్ మిమ్మల్ని అనుమతిని ఇస్తారా అని అడుగుతుంది. ఫైర్‌ఫాక్స్ స్వయంచాలకంగా ఈ అనుమతిని తిరస్కరించేలా మీరు అమర్చుకోవచ్చు. ఆ తర్వాత కూడా, "మీరు కావాలనుకునే" సైట్లకు గమనింపులను చూపించే లేదా పుష్ సౌలభ్యాలను వాడుకునే మినహాయింపులను ఇవ్వవచ్చు.
- మెనూ బొత్తం మీద నొక్కి ఎంచుకోండి.
- పానెల్‌ను ఎంచుకుని, దిగువనున్న "Permissions" విభాగానికి వెళ్ళండి.
- పానెల్‌ను ఎంచుకుని, కిందనున్న "అనుమతులు" విభాగానికి వెళ్ళండి.
- "గమనింపులు" పక్కనున్న
- గమనింపులను అనుమతించమని అడిగే అభ్యర్థనలను నిరోధించు బాక్సులో టిక్కుపెట్టి ని నొక్కండి.
వెబ్ పుష్‌ని పూర్తిగా అచేతనం చేయడం ఎలా?
వెబ్ పుష్‌ని అచేతనం చేసి, ప్రతీ వెబ్‌పేజీలో "గమనింపులను చేతనించాలా?"ని అడగకుండా చేయడానికి:
అడ్రస్ బార్ లో, about:config అని టైపు చేయండి, తర్వాత ప్రెస్ చేయండి EnterReturn.
- about:config ఇది మీ వారెంటీని రద్దు చేయవచ్చు! హెచ్చరిక పేజీ కనిపించవచ్చు. about:config పేజీకి కొనసాగడానికి నొక్కండి.
- dom.webnotifications.enabled అనే అభిరుచి కోసం వెదకండి.
- వెతుకుడు ఫలితంపై రెండుసార్లు నొక్కి true విలువను falseగా మార్చండి.
- dom.push.enabled అనే అభిరుచి కోసం వెదకండి.
- వెతుకుడు ఫలితంపై రెండుసార్లు నొక్కి true విలువను falseగా మార్చండి.